• 7 years ago
Gajwel Congress Party candidate Vanteru Pratap Reddy challenged TRS minister Harish Rao for sitting in Gajwel.
#VanteruPratapReddy
#Harishrao
#kcr
#ktr
#trs
#congress
#telanganaelections2018

తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు అక్రమంగా సంపాదించిన ఆస్తులను బయటకు తీస్తానని, పదిహేడేళ్ల క్రితం ఆయన ఏ రబ్బరు చెప్పులతో తిరిగారో, అలా తిరిగేలా చేస్తానని, నేను గజ్వెల్ నియోజకవర్గం నుంచి గెలుస్తున్నానని మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తెరాస, గజ్వెల్ పోలీసులు, ఈసీ అధికారులపై ఆయన సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు అంతా వదిలేసి వచ్చి గజ్వెల్‌లో ఉంటున్నాడని, గల్లీ లీడర్ గజ్వెల్ లీడర్‌గా మారిపోయాడన్నారు. ఆయన పని చేస్తే ఫర్వాలేదని, అలాగే ప్రజాస్వామ్యబద్దంగా ఓట్లు అడుక్కుంటే తనకు ఇబ్బంది లేదని, కానీ బార్లు ఓపెన్ చేశారని, బీర్లు, బిర్యానీలు పెట్టారని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, ఇప్పటి వరకు రూ.50 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. దొంగ డబ్బులు పంచి, లిక్కర్ పంచి, కులాలను, మతాలగా కొని ఓట్లు వేయిద్దామనుకుంటున్నారని అన్నారు.

Category

🗞
News

Recommended