• 8 years ago
TTDP leader Revanth Reddy reached vijayawada to meet TDP president and CM Chandrababu Naidu.Telangana telugu desam working president Revanth Reddy resigned for Tdp
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో శనివారం మరోసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి విజయవాడలో భేటీ అయ్యారు..ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌ల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్.. టీడీపీలోనే కొనసాగుతారా? లేదా అనేదాని కోసం అందరు ఆసక్తి గ ఎదురు చూసారు. అయితే ఈ ఉత్కంఠకు తెర దించుతూ..టీడీపీకి రేవంత్ గుడ్ బై చెప్పేసారు..తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేశారు. రేవంత్ రాజీనామాతో ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనంగా మారిపోయింది. కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఆయన తదుపరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నదే ఇక ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నాయి.రేవంత్ రాజీనామా విషయం తనకు తెలియదని అధినేత చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. తనకైతే ఇంతరవకు రాజీనామా లేఖ అందలేదని ఆయన తెలిపారు. మరోవైపు రాజీనామా లేఖను చంద్రబాబుకు రేవంతే స్వయంగా అందజేసినట్టు తెలుస్తోంది. భోజనానికి వెళ్తున్నానని చెప్పి రేవంత్ బయటకు వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చి చంద్రబాబును కలుస్తారా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

Category

🗞
News

Recommended