నారా లోకేష్‌కి తమ్మారెడ్ది సంచలన సమాధానం

  • 7 years ago
The Veteran Filmmaker Tammareddy Bharadwaj responded on the comments made by AP CM Chandrababu Naidu and IT Minister Nara Lokesh over the Nandi Awards controversy.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా 2014 అవార్డుల గురించే అందరూ మాట్లాడుతున్నారు. లెజెండ్ సినిమాకు మొత్తం 9 అవార్డుల రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. నంది అవార్డుల వివాదం పై ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా హుందాగా వ్యవహరించారని... అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారని తమ్మారెడ్డి అన్నారు. తాను కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ, అవార్డులను కులాలకు, మతాలకు, పార్టీలకు ఆపాదించవద్దని మొన్ననే చెప్పానని తెలిపారు.
చంద్రబాబు వరకు అంతా బాగానే ఉందని. మంత్రి లోకేష్ ఈ అంశంపై స్పందించిన తీరు మాత్రం బాగోలేదని అన్నారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ లోకేష్ మాట్లాడారని. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం తనకు బాధను కలిగించిందని చెప్పారు.
లోకేష్ ఏదైనా మాట్లాడేముందు ఆయన తండ్రి పరువు గురించి ఆలోచించుకోవాలని సూచించారు. మొన్నటి దాకా మీకు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి? మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు, మీకు మాట్లాడే అర్హత ఉందా? అని తాము అడిగితే బాగోదని... చాలా అసహ్యంగా ఉంటుందని చెప్పారు.

Recommended