• 8 years ago
Reliance changed the rules of the game by launching Jio forcing the other telecom operators to either play by those rules or lose customers. But, this 13-month old startup from Bengaluru wants to change the way the entire game is played.

రిలయన్స్ జియో ప్రత్యర్థి టెలికం కంపెనీలకు షాకిస్తే.. బెంగుళూరుకు చెందిన ఓ స్టార్టప్ జియో‌కు షాకిచ్చే ఆఫర్‌ను తెచ్చింది. రూ.2 ఇస్తే చాలు సూపర్ పాస్ట్ డేటాను ఇస్తామని ప్రకటించింది.
ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. అంతేకాదు జియో మార్గంలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ నడవాల్సిన పరిస్థితులు కూడ అనివార్య పరిస్థితులను కల్పించింది జియో.
డేటా, వాయిస్ కాల్స్ తో పాటు ఫీచర్ ఫోన్‌ పేరుతో అతి చౌకగా ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది జియో. అయితే జియో బాటలోనే ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్‌లు కూడ కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి.
బెంగళూరు నగరంలో ఐఎస్‌పీ లైసెన్స్‌తో ఫైబర్‌ ఆప్టిక్స్‌ ద్వారా డేటా సేవలు అందిస్తున్న వైఫై డబ్బా జియో ప్లాన్లతో పోలిస్తే ఇప్పటికే భారీగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది.కేవలం రూ.2లకే 100 ఎంబీ డేటా ఆఫర్‌ చేస్తోంది. అలాగే రూ.10లకే 500ఎంబీ, రూ.20లకు 1 జీబీ డేటా అందిస్తోంది.మరో వైపు జియో రూ.19 లపై 150 ఎంబీ అందిస్తోంది.

Category

🗞
News

Recommended