Skip to playerSkip to main contentSkip to footer
  • 4/18/2018
During the match of Royal Challengers Bangalore VS Mumbai Indians Ishan Kishan was hitted by the ball which was thrown by hardik pandya.

మంగళవారం రాత్రి వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కంటికి తీవ్ర గాయమైంది.హెల్మెట్ పెట్టుకోకుండా వికెట్ కీపింగ్ చేసిన ఇషాన్ కిషన్.. హార్దిక్ పాండ్య త్రోగా విసిరిన బంతిని అందుకోబోయి గాయపడ్డాడు.
దీంతో.. కాసేపు నొప్పితో మైదానంలో విలవిలలాడిపోయిన ఇషాన్.. ప్రథమ చికిత్స అనంతరం మైదానాన్ని వీడాడు. అక్టోబరు 1, 2017 నుంచి ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కీపింగ్ చేసే వెసులబాటుని కల్పించారు. దీంతో ఇషాన్ కిషన్ స్థానంలో ఆదిత్య తారె మ్యాచ్ చివరి వరకూ వికెట్ కీపింగ్ చేశాడు.
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్, బౌలింగ్ లోనూ ఇరగదీస్తోంది. ఆ జట్టు బౌలింగ్ లో కోహ్లీ కూడా ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో ఎంతో ఉత్కంతభారితంగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు VS ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌లో 46 పరుగులు ఉండగానే ఓవర్లు అయిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి ని చవి చూడాల్సి వచ్చింది.
ఆట ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 167/8 చేయగా ముంబయి ఇండియన్స్ 213/6 చేసి విజయ పతాకం ఎగురవేసింది.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Category

🥇
Sports

Recommended