• 6 years ago
Australia Ball Tampering : Former Australian cricketers Shane Warne and Mitchell Johnson also said they were disappointed by the Tampering.

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియన్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ బాల్ టాంపరింగ్ వ్వవహారం ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలింది. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియాను క్రికెట్‌ మాజీలు మండిపడుతున్నారు.
అలెన్‌ బోర్డర్‌
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ మాట్లాడుతూ 'ఆసీస్‌ జట్టు చర్య తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. సిగ్గుగా కూడా అనిపిస్తోంది' అని అన్నాడు.
షేన్‌ వార్న్‌
బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం ఆస్ట్రేలియా నైజానికి విరుద్ధమని దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అన్నాడు. ఈ సందర్భంగా వార్న్ మాట్లాడుతూ 'బాన్‌క్రాఫ్ట్‌పై జాలేస్తుంది. ఇది అతనొక్కడే తీసుకున్న నిర్ణయం కాదు. ఏదో చేయాలని అతడి జేబులో ఏదో పెట్టారు' అని అన్నాడు.
షాన్‌ పొలాక్‌
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ షాన్‌ పొలాక్‌ మాట్లాడుతూ 'ఆస్ట్రేలియా పక్కా ప్రణాళిక ప్రకారమే టాంపరింగ్‌కు పాల్పడింది. మోసానికి పాల్పడుతూ దొరికిపోయింది అని అన్నాడు.
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బల్‌
బాల్ టాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బల్‌ మాట్లాడుతూ 'ఈ దేశమంతా మిమ్మల్ని గొప్పగా చూస్తుంది. రాజకీయ నాయకుల కంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తుంది. కానీ మీ చర్య దిగ్భ్రాంతిని, నిరాశను కలిగించింది అని అన్నాడు.
మైకేల్ క్లార్క్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ 'మైదానంలో తమ సహచర ఆటగాళ్లు చేసింది క్షమించరాని తప్పుగా అభివర్ణించాడు. అదేవిధంగా స్టీవ్‌ స్మిత్‌కు, సహచర ఆటగాళ్లకు తన తరఫున పూర్తి సానుభూతి ప్రకటిస్తున్నా. అవసరమొస్తే జట్టుకు తిరిగి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా' అని అన్నాడు.

Category

🥇
Sports

Recommended