• 4 months ago
Telangana Govt Offer to Indian Cricketer Siraj : టీ20 ప్రపంచకప్ 2024​ విజేత జట్టులోని హైదరాబాదీ క్రికెటర్​ మహమ్మద్​ సిరాజ్​కు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. క్రికెటర్​ సిరాజ్​కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్​ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం సీఎం రేవంత్​ రెడ్డిని టీమిండియా క్రికెటర్​ సిరాజ్​ కలిశారు. అనంతరం హైదరాబాదీ క్రికెటర్​ను సీఎం అభినందించారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని టీమిండియా క్రికెటర్​ మహమ్మద్​ సిరాజ్ జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో​ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం రేవంత్​కు టీమిండియా జెర్సీని బహుకరించారు. టీ20 ప్రపంచకప్ 2024​ సాధించినందుకు సిరాజ్​ను సీఎం రేవంత్​ రెడ్డి అభినందించారు. ఆ తర్వాత శాలువతో హైదరాబాదీ క్రికెటర్​కు సత్కరించారు.

కాసేపు టీ20 ప్రపంచకప్​లో భారత్​ ప్రయాణం, ఫైనల్​లో విజయం, సభ్యుడిగా ఎలా సంబరాలు చేసుకున్నారు, విజయం సాధించినప్పుడు టీమిండియా ప్లేయర్లు భావోద్వేగాలను సీఎం రేవంత్​ అడిగి తెలుసుకున్నారు. ఇలా కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​, హెచ్​సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్​ సహా పలువురు ఉన్నారు.

Category

🗞
News
Transcript
01:00You

Recommended