ఉద్యోగినితో ఉప ప్రధాని సెక్స్: స్టాఫ్‌తో మంత్రుల సెక్స్‌

  • 6 years ago
Australia is banning private relations between government ministers and their staff following a scandal involving the deputy prime minister and his press officer.

ఓ ఉద్యోగినితో ఆస్ట్రేలియా ఉప ప్రధాని లైంగిక సంబంధం పెట్టుకోవడం వివాదంగా మారింది. అది ప్రభుత్వానికి తలనొప్పిగా కూడా మారింది. దాంతో మంత్రులకు ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ ప్రవర్తనా నియమావళిని జారీ చేశారు. మంత్రులు ఎవరు కూడా తమ సిబ్బందితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదని ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఆస్ట్రేలియా ఉప ప్రధాని బార్నబీ జాయిస్ (50) తన మాజీ మీడియా సలహాదారు విక్కీ కాంపియన్ (33)తో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
జాయిస్ కారణంగా విక్కీ గర్భం దాల్చినట్లుగా ఓ మ్యాగజైన్ గతవారం వెలుగులోకి తెచ్చింద. ఆయనే స్వయంగా ఆ విషయాన్ని అంగీకరించారు. దాంతో జాయిస్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. వివాహితులైనా, అవివాహితులైనా... ఎవరు కూడా మంత్రులు సిబ్బందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని, అలా చేస్తే అది ప్రమాణాలను ఉల్లంఘించినట్లేనని టర్న్‌బుల్ జర్నలిస్టులతో అన్నారు.
ఇక మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ట్రంప్ గతంలో ఓ పోర్న్ స్టార్‌తో లైంగిక సంబంధం కొనసాగించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ నటితో ట్రంప్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. అయితే, ఈ వార్తలను వైట్ హౌస్ ఖండించింది.తాజాగా, ట్రంప్‌పై వచ్చిన ఆ ఆరోపణల్లో నిజముందని ఆయన వ్యక్తిగత అటార్నీ మైకేల్ కోహెన్ చెప్పడం ఇప్పుడు మరోసారి సంచలనానికి తెరతీసింది

Category

🗞
News

Recommended