• 7 years ago
Needing five off the final delivery, Karthik smashed Soumya Sarkar over extra-cover as a second-string Indian side held its nerve in a tense situation to chase down a target of 167 in 20 overs.

సాధారణంగా చివరి బంతికి బౌండరీకి ప్రయత్నిస్తుంటారు బ్యాట్స్‌మెన్‌. అదీ చేజింగ్ జట్టైతే మామూలు స్థాయిలో ఉండదు ఆ ఉత్కంఠ. ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. శ్రీలంక వేదికగా జరుగుతోన్న నిదహాస్ ట్రోఫీలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో గెలిచింది. ఒక దశలో భారత్ గెలుపు దాదాపు అసాధ్యమే అనుకున్నారంతా. కానీ దినేష్ కార్తీక్ దాన్ని సాధించి చూపాడు. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించిన కార్తీక్ కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఒకే ఓవర్లో 6, 4, 6, 0, 2, 4 పరుగులను నమోదు చేసుకున్న కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. ఈ షాట్ మ్యాచ్‌కే హైలైట్.
టీమిండియా గెలవాలంటే చివరి బాల్‌కు 5 పరుగులు చేయాల్సి ఉంది. ఫోర్ కొడితే సూపర్ ఓవర్. ఇలాంటి దశలో బంగ్లా పార్ట్‌టైమ్ బౌలర్ సౌమ్య సర్కార్.. వికెట్లకు దూరంగా వేసిన బంతిని కవర్స్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు కార్తీక్. అంతే భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోగా.. బంగ్లా ప్లేయర్స్ గ్రౌండ్‌లోనే కుప్పకూలారు.
ఈ విజయంలో భారత జట్టుతో పాటు శ్రీలంక అభిమానులు సైతం పాల్గొన్నారు. శుక్రవారం బంగ్లాతో తలపడిన శ్రీలంక జట్టు వివాదాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బంగ్లా జట్టు విజయాన్ని కాంక్షించని శ్రీలంక భారత్ కు మద్దతు తెలిపింది.

Category

🥇
Sports

Recommended