• 11 hours ago
 దుబాయ్ లో ఉన్న చోటనే కూర్చుని అన్ని మ్యాచులు ఆడేస్తున్నారనే గోల వైపు...కొహ్లీ, రోహిత్ శర్మ కు ఇదే ఆఖరి ఐసీసీ ఈవెంట్ అనే ప్రచారం మరో వైపు...ఈ రెండు గోలల మధ్య అసలు గోల్ ఇయ్యన్నీ కాదు ఈరోజు బ్లాక్ క్యాప్స్ బాబులను ఓడించేయాలి ఛాంపియన్స్ ట్రోఫీ కప్పెత్తుకు పోవాలి అనే అస్సలు టార్గెట్ తో బరిలోకి దిగుతోంది భారత్. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అయితే పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ నాలుగేళ్లలో మనం ఆడుతున్న నాలుగో ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇది. 2024 టీ 20 వరల్డ్ కప్ మాత్రమే గెలిచాం. మిగిలిన రెండింటిలో ఓడిపోయాం. సో నాలుగో సారి కచ్చితంగా విజయమే సాధించాలని రోహిత్ శర్మ అండ్ గ్యాంగ్ అయితే బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇక బలాబలాల సంగతి తెలిసిందేగా కదా. మనం ఎలాగో టాస్ గెలవం కాబట్టి కివీస్ ఏం ఇచ్చినా రెడీగానే ఉండాలి. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ను ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు అది పక్కా. గిల్ బాబు, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ అందరూ మంచి టచ్ లో నే ఉన్నా అసలు ఫ్యాన్స్ అంతా ఎదురు చూసేది మెల్లగా ఫామ్ లోకి వచ్చి తన లోని పాత కొహ్లీని చూపిస్తున్న విరాట్ కొహ్లీ గురించే. పాకిస్థాన్ లో సెంచరీ బాది కసి తీర్చుకున్న కొహ్లీ..ఆస్ట్రేలియా మీద జరిగిన సెమీస్ లోనూ ఇరగదీశాడు. జస్ట్ లో సెంచరీ మిస్సయ్యాడు కానీ మంచి జోరు మీదున్నాడనైతే అర్థం అవుతోంది. ఇక చివర్లో మెరుపులు మెరిపించటానికి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఎలాగో ఉన్నారు. ఇక మన ప్రధాన బలం ఈ టోర్నీలో అంటే కచ్చితంగా స్పిన్నర్లనే చెప్పాలి. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ తో దుబాయ్ పిచ్ ల్లో ప్రత్యర్థులకు పిచ్చెక్కిస్తున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా నుంచి వరుణ్ కి అద్భుతమైన సహకారం అందుతోంది. ఇక మహ్మద్ షమీ పేస్ డిపార్ట్మెంట్ భారం అంతా ఒక్కడై మోస్తున్నాడు. ఒక స్పిన్నర్ ను తగ్గించుకుని అర్ష్ దీప్ ను తీసుకునే సాహసాల్లాంటివి కూడా గంభీర్ రోహిత్ ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫైనల్ నెగ్గటానికి అవసరమైన ఏ అవకాశాన్ని వదలాలి అనుకోవట్లేదు మనోళ్లు. న్యూజిలాండ్ లో రచిన్ రవీంద్రను ఆపాలి. ముఖం మీద బాల్ పడి రక్తం కారితే ఒక్క మ్యాచ్ రెస్ట్ తీసుకుని తిరిగొచ్చి రెండు సెంచరీలు బాదాడు రచిన్ రవీంద్ర. ఇక వాళ్ల ఫీల్డింగ్ ని మొన్న చూశాం కదా. గాల్లో పక్షుల్లా ఎలా ఎగరుతున్నారో ఆ ఫిలిఫ్స్ కి దండం పెట్టాలి.  వాళ్లకు మన బలం లేదు అంటే మనకు స్పిన్నర్లు ఇంత మంది ఉంటే వాళ్లకు శాంట్నర్ ఒక్కడే ఉన్నాడు. మొన్న ఇండియన్ రూట్స్ ఉన్న సంగాను ట్రై చేశారు కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. కానీ మ్యాట్ హెన్రీ పాక్ పిచ్ లపై బాగా బౌలింగ్ చేశాడు. టాప్ వికెట్ టేకర్ అతనే టోర్నీలో చూడాలి మనోళ్లని ఇబ్బంది పెట్టగలడేమో. మొత్తంగా ఈ ఫైనల్ కోసం 140 కోట్ల మంది భారతీయులు మధ్యాహ్నం టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవటం అయితే పక్కా. మనం మూడో సారి ట్రోఫీ ని ముద్దాడతామో లేదా కివీస్ రెండో సారి హగ్ చేసుకుంటుందో వెయిట్ అండ్ సీ.

Category

🗞
News

Recommended