ప్రముఖ రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీఓ మరో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్‌ట్రేటర్ వెహికల్‌ను విజయవంతంగా పరీక్షించి డీఆర్‌డీఓ చరిత్ర సృష్టించింది. ఈ పరీక్ష సక్సెస్ కావడంతో స్వయం సమృద్ధిలో భారత్ కీలక ముందడుగు వేసినట్లయ్యింది. డీఆర్‌డీఓ సాధించిన ఈ విజయంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ జెట్ ఫ్లయిట్‌ను రూపొందించారు. దీంతో రక్షణరంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ టెక్నాలజీ నెక్ట్స్ జనరేషన్ హైపర్ సోనిక్ వాహనాలకు బాట వేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Category
🗞
News