• 8 years ago
Telangana minister KT Rama Rao will talk to Nagarjuna on Annapurna Studio land for Road expansion.

రాష్ట్ర మంత్రి కేటీ రామారావు నగర రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు రోడ్లను విస్తరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియో లింకు రోడ్డుకు మోక్షం లభించనుంది. రోడ్డు అభివృద్ధి కోసం ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య తగ్గించేందుకు రెండు సంవత్సరాల క్రితం ప్రతిపాదించిన లింకు రోడ్డు నిర్మాణానికి ప్లాన్‌ సిద్ధం చేసింది ప్రభుత్వం.
హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు రోజుకు రోజుకూ పెరిగిపోతున్నాయి. కీలక సమయా(ఉదయం, సాయంత్రం)ల్లో కిలో మీటరు దూరం వెళ్లాలంటే అరగంట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఉదయం, సాయంత్రం అయితే ట్రాఫిక్‌లో గమ్య స్థానాలకు వెళ్లడం సాహసమే అవుతోంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గాలంటే అంతర్గత దారులను విస్తరించాలని, లింకు రోడ్లు అభివృద్ధి చేయాలని గతంలో అనేక సర్వేలు తేల్చి చెప్పాయి. వీలు ఉన్న ప్రాంతాల్లో లింక్‌ రోడ్లు రూపొందించడం వల్ల చాలా వరకు ట్రాఫిక్‌ భారం తప్పుతుందని కొన్ని ప్రాంతాల్లో ఇది మంచి ఫలితాలు ఇచ్చిందని సర్వే నిర్వాహకులు చెప్పారు.

Category

🗞
News

Recommended