• 8 years ago
Srinag Managing partner Chintalapudi Srinivasa Rao responded on Cine Actor Nagarjuna's sister Naga Susheela's complaint on him.

ప్రముఖ సినీ నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల తనపై ఫిర్యాదు చేయడంపై శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ స్పందించారు. లాకప్‌లో పెట్టయినా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పుడు లావాదేవీలకుపాల్పడలేదని చింతలపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బునే తీసుకున్నానని చెప్పారు. తనపై తప్పుగా ఫిర్యాదు చేశారని అన్నారు. 2005-06లోనే భూములను రిజిస్టర్ చేయించామని చెప్పారు. ఆ డబ్బులున్నీ కంపెనీనే ఖర్చు చేసిందని, ఇప్పుడు ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. నిధులు దుర్వినియోగం చేశాడని తనపై తప్పుగా ఫిర్యాదు చేశారని నాగ సుశీలపై ఆయన మండిపడ్డారు. కోర్టులో ఉన్న సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చేందుకే ఈ కేసు పెట్టారని అన్నారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామని వివరించారు. అయినా తాను ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.

Category

🗞
News

Recommended