దామగుండం నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి

  • 2 days ago
Rajnath Singh Lay Foundation Stone For The Radar Station : వికారాబాద్ జిల్లా దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసిన అనంతరం వీఎల్‌ఎఫ్‌ నమూనాను పరిశీలించారు.

శత్రు దేశాలపై నిఘా ఉంచేందుకు నౌకాదశం ఈ రాడార్​ను నెలకొల్పాలని నిర్ణయించింది. దామగుండంలో అనువైన స్థలం ఉండటంతో రక్షణశాఖ అందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 24న రిజర్వు ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాలను అటవీ అధికారులు నౌకా దళానికి అప్పగించారు. దీంతో రాడార్ స్టేషన్‌కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో ఇవాళ శంకుస్థాపన నిర్వహించారు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో దామగుండం ఉంది.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
01:00Thank you very much.
01:30Thank you very much.
02:00Thank you very much.

Recommended