• 5 years ago
In a major boost for the Indian Army, Defense Research and Development Organisation (DRDO) on Wednesday successfully flight-tested indigenously-developed Man Portable Anti-Tank Guided Missile (ATGM) system. The test f!re was conducted in the ranges of Kurnool, Andhra Pradesh.It is a low weight, f!re-and-forget Man Portable Anti-Tank Guided Missile (MPATGM).This is the third successful test firing of the missile system which is being developed for Indian Army's need for 3rd generation ATGMs.
#DRDO
#AntitankMissile
#Defence
#Kurnool
#AndhraPradesh
#rajnathsingh
#RakshaMantri
#missile
#Army

కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డీఆర్‌డీవో నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ను డీఆర్‌డీవో పరీక్షించింది. ఆర్మీ సహకారంతో క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా డీఆర్‌డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణితో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని యుద్ధ ట్యాంకును ధ్వంసం చేశారు. ఇది భారత సైన్యం ఆయుధ సంపత్తిని మరింత ఇనుమడింపజేసింది. ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్లు డీఆర్​డీవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం విజయవంతం కావటంతో సైన్యం కోసం మూడో తరం క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేసి ఇవ్వడానికి మార్గం సుగమమైంది. డీఆర్​డీవో బృందాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ అభినందించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న డీఆర్​డీవో పరిశ్రమలో ప్రయోగాన్ని చేపట్టారు.

Category

🗞
News

Recommended