Rana Has Bagged A Cameo Role In Anushka’s Next Movie | FilmiBeat Telugu

  • 5 years ago
After huge success of Baahubali, Bhagmat Rana has bagged a cameo role in Anushka’s next movie Silence. The movie, which is touted to be a thriller would also star R. Madhavan in the lead role with Anushka, and if news reports are anything to go by, then the actress would be silent throughout the movie.
#Anushkashetty
#prabhas
#RanaDaggubati
#R.Madhavan
#Silencemovie
#baubali
#tollywood

బాహుబలి మూవీ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బ్యూటీ అనుష్క మధ్య అఫైర్ గురించి లెక్కలేనని కథనాలు, రూమర్లు వినిపించాయి. అయితే వారిద్దరూ వాటిపై పెద్దగా స్పందించకపోగా తమ పని తాము చేసుకొంటూ పోతున్నారు. ఇంకా మాట్లాడితే మా మధ్య ఉంది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అనే డైలాగ్ వినిపించారు. బాహుబలి తర్వాత అనుష్క నటించిన చిత్రం భాగమతి. ఆ చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్న తర్వాత కొంత గ్యాప్ తీసుకొని సైలెంట్ చిత్రంలో నటిస్తున్నది. ఆ చిత్రానికి సంబంధించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే..
స్థూలకాయాన్ని తగ్గించుకొన్న తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం సైలెన్స్. ఈ చిత్రంలో అనుష్క ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడని పాత్రలో కనిపిస్తున్నారట. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ఓ కీలకపాత్రలో నటించడం చర్చనీయాంశమైంది. ప్రత్యేక పాత్రలో ప్రభాస్‌ కాకుండా రానాకు అనుష్క ఓటేయ్యడం క్రేజీగా మారింది.
ఇక సైలెన్స్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం బహుభాషల్లో రూపొందుతున్నది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెకకతున్నది. తొలుత ఈ సినిమా కోసం ప్రభాస్‌ను సంప్రదించారట. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా తాను చేయలేనని చెప్పడంతో రానాను ఆ పాత్రలోకి దించారు. దాంతో రానా, అనుష్క కలిసి నటించేందుకు మార్గం సుగమైంది.