• 6 years ago
Cine Box : The team of ‘RRR’ has put an end to all the speculations about the female lead. Rajamouli’s ‘RRR’ that features NTR as freedom warrior Komaram Bheem and Ram Charan as Alluri Seetharamaraju is under progress. A foreign actress Olivia Morris has been cast opposite NTR. Her name has officially been announced today.
#RRR
#RRRupdate
#SarileruNeekevvaru
#rajamouli
#ramcharan
#nagachaitanya
#srireddy
#pawankalyan
#samantha
#vijaydevarakonda
#jumanji2
#ranimukharji
#tollywood


బాహుబలి సినిమాలతో సంచలనం స‌ృష్టించాడు దర్శకధీరుడు రాజమౌళి. టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన జక్కన్న.. తన తదుపరి చిత్రాన్ని కూడా అదే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలతో ఆర్ఆర్ఆర్ అనే మల్టీ స్టారర్‌ను ప్రకటించి టాలీవుడ్‌ను షేక్ చేశాడు. ఈ చిత్రాన్ని కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ చేసేందుకు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులను భాగస్వామ్యం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు జోడీగా విదేశీ భామను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
అయితే సినిమా తొలి ప్రెస్‌ మీట్‌లో ఎన్టీఆర్‌కు జోడిగా.. డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ అనే హాలీవుడ్‌ భామ నటిస్తున్నట్టుగా ప్రకటించాడు మన జక్కన్న. కానీ కొన్ని కారణాల వల్ల డైసీ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికే పనిలో ఉంది రాజమౌళి టీం. ఫైనల్‌గా ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికి పట్టుకున్నారు ఆర్ఆర్ఆర్‌ టీం. ఆమె ఫోటోతో పాటు క్యారెక్టర్‌ పేరు అధికారికంగా ప్రకటించారు. లండన్‌కు చెందిన ఓలివియా మోరీస్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా జెన్నీఫర్‌ పాత్రకు ఫైనల్‌ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఓలివియా పలు టీవీ షోస్‌లోనూ నటించింది.

Recommended