• 6 years ago
Suprem hero Sai Dharam Tej upcoming movie with director maruthi. In this movie the heroine Rashi Khanna confirmed to romance with tej.
#saidharamtej
#maruthi
#rashikhanna
#malavikasharma
#tollywood
#movienews
#teluguactress

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన రాశీ ఖన్నా నటించబోతోంది తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో నటించి భేష్ అనిపించుకున్న ఈ జంట మరోసారి జోడీ కట్టనున్నారని సమాచారం. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో రాశీ ఖన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత కొంత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా ట్రాక్ ఎక్కాలని భావించిన ఆయన డైరెక్టర్ మారుతి చేతికి తన కొత్త సినిమా బాధ్యతను అప్పగించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేశారు. దీంతో చిత్రాన్ని అన్ని హంగులు జోడించి చిరంజీవి అంచనాలను ఏ మాత్రం వమ్ము చేయకూడదని భావిస్తున్నాడట డైరెక్టర్ మారుతి

Recommended