Skip to playerSkip to main contentSkip to footer
  • 1/28/2018
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Sunday launched 'Surya Aaradhana' (Sun worship) programme in Vijayawada to promote solar energy and reduce pollution.

ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సూర్యారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

సూర్యారాధన ప్రజాహిత వేడుక అన్నారు. అన్ని మతాల్లోను సూర్యునికి ప్రాధాన్యం ఉందని చెప్పారు. అరబ్ దేశాల్లో షమ్స్ అనే పేరుతో ఆరాధిస్తారని, నీరు - చెట్టు, జలసిరికి హారతి, వనం - మనం, ఏరువాక కార్యక్రమాలను ప్రకృతి ఆరాధనలో భాగంగా చేపట్టామన్నారు.
సూర్యకాంతి ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సూర్యుడు నిత్య చైతన్య శక్తి అని చెప్పారు. తూర్పు తీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున సన్ రైజ్ స్టేట్‌గా నినాదం ఇచ్చామని చెప్పారు. సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా, మానసికంగా వృద్ధిని సాధిస్తామన్నారు. చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాధిస్తే మనం నిత్య ప్రేరణ పొందవచ్చని చెప్పారు. సూర్యుడు జస్టిస్ చక్రవర్తి లాంటివాడన్నారు. పేదా, గొప్పా అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాడన్నారు.

Category

🗞
News

Recommended