దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం పీ-4 విధానం

  • last month
దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. నదుల అనుసంధానాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, తయారీ రంగ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. అధిక జనాభాను బలంగా మార్చుకోవాలన్నారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వివిధ అంశాలపై ప్రతిపాదనలు చేశారు. భారత్‌ ఆర్థికంగా 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమైనందున 2047 నాటికి రెండు లేదా ఒకటో స్థానానికి ఎదిగేలా ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.

Recommended