• 7 years ago
Bhansali's Padmavat is based on the legend of Rani Padmavati, a legendary Rajput queen mentioned in the Awadhi-language poem Padmavat, written by Sufi poet Malik Muhammad Jayasi. Sanjay Leela Bhansali's latest offering may be titled Padmaavat but it's Ranveer Singh's show all the way.


సిల్వర్‌ స్క్రీన్ మీద సినిమా కథలను దృశ్యకావ్యంలా రూపొందించడంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దిట్ట అనడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసిన చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం పద్మావతి. అయితే సెన్సార్ అభ్యంతరాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పద్మావత్ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రాణి పద్మావతిగా దీపికా పదుకొన్, అల్లావుద్దీన్ ఖిల్లీగా రణ్‌వీర్ సింగ్, రావల్ రతన్ సింగ్‌గా షాహీద్ కపూర్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏ మేరకు చేరుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
సింహళ దేశపు యువరాణి పద్మావతి (దీపికా పదుకోన్)కి వేట అంటే చాలా ఇష్టం. వేటాడుతుండగా పద్మావతి బాణం తగిలి మేవాడ్ వంశానికి చెందిన రావల్ రతన్ సింగ్ (షాహీద్ కపూర్) గాయపడుతాడు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం జరుగుతుంది. వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. తన ప్రేమను వ్యక్తం చేసిన రతన్ సింగ్.. పద్మావతిని పెళ్లాడటమే కాకుండా తన దేశం చిత్తోర్‌గఢ్‌కు తీసుకెళ్తాడు. కథ గమనంలో తన రాజగురువు రాఘవ కేతనుడికి పద్మావతి దంపతులు దేశ బహిష్కారం విధిస్తాడు. దాంతో రాఘవకేతనుడు ఢిల్లీ సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీ చెంతన చేరుతాడు. ఆ తర్వాత చిత్తోర్‌గఢ్‌పై ఖిల్జీ దండయాత్ర చేసి రతన్ సింగ్‌ను ఎత్తుకెళ్తాడు. అక్కడి నుంచి పద్మావతి చిత్ర కథ కొత్త మలుపు తిరుగుతుంది.

Recommended