In a shocking incident, a Jet Airways lady crew member was arrested on Monday for carrying U.S. dollars worth Rs Rs 3.21 crore.
విమానయాన దిగ్గజ సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ మహిళా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె రూ.3.21కోట్లు విలువ చేసే అమెరికా డాలర్లను అక్రమంగా తరలిస్తూ పట్టుడటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.హాంగ్‌కాంగ్-ఢిల్లీ జెట్ ఎయిర్‌వేస్ విమాన సిబ్బంది అయిన ఆమెపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. ఆమె తరలిస్తున్న 4,80,200 డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఢిల్లీ నుంచి హాంగ్‌కాంగ్ వెళ్లాల్సిన విమానంలో ఉన్న ఆమెను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.
నిందితురాలు ఢిల్లీలోని అమిత్ మల్హోత్రా అనే వ్యక్తితో కలిసి పనిచేస్తున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. అమిత్ స్మగ్లింగ్ కోసం విమాన సిబ్బందిని ఉపయోగించుకుంటాడని తమ విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు.
ఎవరికీ అనుమానం రాకుండా విమాన సిబ్బంది ద్వారా డబ్బును విదేశాలకు పంపి అక్కడ బంగారం కొనుగోలు చేసి తిరిగి భారత్‌కు అక్రమంగా తీసుకొస్తారని చెప్పారు. ఆరేళ్ల క్రితం విమాన ప్రయాణంలో మల్హోత్రా ఈ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగినిని పరిచయం చేసుకున్నాడని తెలిపారు.

Category
🗞
News