• 7 years ago
Anchor Pradeep said in a video posted in Social media that he will follow th procedings in drunk and drive case.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌కు రాకపోవడంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. దానిపై ప్రదీప్ స్పందించారు. తాను తప్పు చేసినట్లు ప్రదీప్ అంగీకరించారు. తన మాదిరిగా ఇక ఎవరు కూడా తప్పు చేయకూడదని సూచిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను కౌన్సిలింగ్‌కు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇస్తూ మరిన్ని విషయాలను ఆ వీడియోలో ఆయన పొందుపరిచారు.
అందరికీ నమస్కారం.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్స్‌ను చట్ట ప్రకారమే ఫాలో అవుతాను. నాకు వచ్చిన సూచనల ప్రకారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ, దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌కు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను" అని ప్రదీప్ అన్నారు.
అయితే ఈలోగా నేను ముందుగానే కమిట్ అయిన ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. అందువల్ల నేను అందుబాటులో లేనంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. తెలియజేసేది ఏమంటే షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను" అని అన్నారు.

Category

🗞
News

Recommended