గజల్ శ్రీనివాస్ గదిలో నగ్నంగా : అలాంటివాడు కాదంటూ మరో కోణం ?

  • 6 years ago
Parvathi, the maid of Ghazal Srinivas, who has been named as A2 in his case, denied that there was any force on his part on the victim. She said that she has been working with Srinivas from the past 20 years and has not found anything wrong in his behaviour.


గజల్ శ్రీనివాస్ పచ్చిమోసగాడని లైంగిక వేధింపుల బాధితురాలు ఆరోపించారు. ఓ మీడియా ఛానల్‌తోమాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ ఓ నీచుడు, నీకృష్ణుడు అని దుయ్యబట్టారు. అమ్మాయిలందర్నీ అదే దృష్టితో చూస్తాడని తెలిపారు.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న సేవ్ టెంపుల్ వెబ్ రేడియో(ఆలయవాణి)లో తాను రేడియో జాకీగా పనిచేస్తున్నానని బాధితురాలు తెలిపారు. తాను 8నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నానని, 4నెలలుగా గజల్ శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. రెండు నెలల నుంచి గజల్ శ్రీనివాస్ నుంచి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు.

ఆఫీసులోని ఓ ప్రత్యేక గదిలో గజల్ శ్రీనివాస్ ఎప్పుడూ నగ్నంగా ఉండేవాడని బాధితురాలు తెలిపారు. తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని చెబితే ఎవరూ నమ్మరని తెలుసు, అందుకే సాక్ష్యాధారాలతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. అతడు పనిమనిషితో లైంగిక చర్యల్లో పాల్గొనే వాడని, ఆ వీడియోలను కూడా తాను పోలీసులకు సమర్పించానని తెలిపారు.

Recommended