• 7 years ago
Yaduveer Krishnadatta Chamaraja Wodeyar and his wife Trishika Kumari welcomed the new born baby to the family on Wednesday.

నాలుగు శతాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టకేలకు మైసూరు రాజవంశానికి వారసుడొచ్చాడు. మైసూరు రాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడయార్- త్రిషికా కుమారి సింగ్ దంపతులకు బుధవారం కుమారుడు జన్మించాడు. దీంతో రాజవంశంతో పాటు మైసూరు అంతటా సంబరాలు అంబరాన్నంటాయి.
మైసూరు యువరాణి త్రిషికా బుధవారం ఉదయం పురుటి నొప్పులతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. రాత్రి పొద్దుపోయాక ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
మైసూరు యువరాజు యదువీర్‌ దంపతులకు కుమారుడు జన్మించడంతో సుమారు 400 ఏళ్ల నాటి శాపానికి విముక్తి కలిగిందని మైసూరు రాజ కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.

Category

🗞
News

Recommended