సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. క్లీన్ U సర్టిఫికేట్ కథ. ఇద్దరు అన్నదమ్ముళ్లు వాళ్ల మధ్య అనుబంధం....చిన్న చిన్న మనస్పర్థలు..మళ్లీ కలిసిపోయేంత ప్రేమ...కల్మషం లేని తల్లి, మనిషి అంటేనే మంచోడు రా అనే నాన్న. మనవళ్ల భవిష్యత్తు కోసం మథనపడే నాయనమ్మ..గలగలా మాట్లాడే సీత...సత్యభామ లాంటి గీత..అసలు ఏముంది ఈ సినిమాలో. పన్నెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు కొంత మంది సీరియల్ అన్నారు. మరి ఇంత మంది జెన్ జీ కిడ్స్ పుష్కరం తర్వాత చేస్తున్న ఈగోల ఏంటీ. కేవలం మహేష్ బాబు సినిమానా అనా..లేదా వెంకీ ఫ్యాన్సా. ఏదీ కాదు ఈ రోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజైంది. అంతే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఉన్నా థియేటర్లకు ఫ్యాన్స్ పోటెత్తారు. పూలకుండీలు తీసుకుని మరీ వస్తున్నారు. మహేష్ బాబు తన్నిననప్పుడు తన్నటానికి…..చెల్లి పెళ్లి చేసినంత సందడి చేస్తున్నారు. వయస్సుతో తేడా లేకుండా చిన్నా పెద్దా కలిసి డ్యాన్స్ లు చేస్తున్నాడు గోల గోల చేస్తున్నారు థియేటర్లలో. అప్పగింతల కార్యక్రమాలు, పేర్లు చెప్పుకోవటాలు, ఆఖరకు ఫుల్ ఎమోషనల్ సీన్స్ లో కూడా వైబ్ అవుతున్నారు. కుటుంబ వ్యవస్థ మన బలం..అలాంటి బలమైన కుటుంబాలే అందమైన మన దేశాన్ని నిర్మిస్తున్నాయంటూ పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్ అడ్డాల రాసుకున్న మాటలు..పుష్కరం దాటినా ఆ ఎమోషన్ ను నేటికీ క్యారీ చేస్తూ కుటుంబకథల గొప్పతనాన్ని ఇలా రీ రిలీజుల్లోనూ ఘనంగా చాటుతున్నాయి. టిక్కెట్స్ అస్సలు దొరకటం లేదు. వీకెండ్ కాబట్టి ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్ లు అయిపోతున్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫుల్ హ్యాపీ...12ఏళ్ల క్రితం తను బలంగా నమ్మిన ఓ కుటుంబ కథ నేటికీ పేరుతో పాటు డబ్బులు కూడా తెచ్చిపెడుతోంది. మరి ఫ్యామిలీ ని మించిన ఎమోషన్ ఎవరికైనా ఏం ఉంటుంది.
Category
🗞
News