• 2 days ago
Singer Kalpana Try to Die : ప్రముఖ సినీ గాయని కల్పన తన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటం కలకలం రేపింది. భర్తకు ఫోన్​ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నానంటూ చెప్పడంతో ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు. పోలీసులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిటికల్​ కేర్​ యూనిట్​లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

తమిళనాడుకు చెందిన కల్పన తెలుగు, తమిళం సహా పలు భాషల్లో గాయనిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేపీహెచ్​బీలోని నిజాంపేట వర్టెక్స్ ఫ్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసముంటున్నారు. గతంలో కల్పనకు వివాహమైనా 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమెకు 18 ఏళ్ల కుమార్తె ఉంది. 2018లో కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్‌ను పెళ్లిచేసుకుని ఐదేళ్లుగా నిజాంపేటలోని విల్లాలో ఉంటున్నారు. భర్త తరచూ కేరళకు వెళ్లి వస్తుంటారు. ఎప్పుడూ మానసిక ఒత్తిడికి గురయ్యే కల్పన, ప్రశాంతత కోసం తరచూ మాత్రలు తీసుకుంటారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఆమె భర్త చెన్నై వెళ్లారు. ఇంట్లో కల్పన ఒక్కరే ఉన్నారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు తన భర్తకు ఫోన్ చేసి నేను ఆపస్మారక స్థితిలోకి వెళ్తున్నాను' అని చెప్పారు. భర్త తిరిగి కాల్ చేయగా స్పందన లేదని తెలుస్తోంది.

Category

🗞
News

Recommended