అక్షరయోధుడికి పుష్పాంజలి - దేశవ్యాప్తంగా రామోజీరావుకు ఘననివాళులు

  • 2 months ago
అక్షరం అంటే చెరిపినా చెరగనిది అని, కలకాలం నిలిచిపోయేది అని అర్థం. ఆ అక్షరాలలోనూ సువర్ణాక్షరాలు కొన్ని ఉంటాయి. వాటిలో కొన్ని చరిత్ర పుస్తకంలో స్థానాన్ని సంపాదించుకుంటాయి. తరతరాలకూ ఓ జీవిత పాఠమై నిలుస్తాయి. అద్భుత విజయాలకు చిట్కాలను బోధిస్తాయి. సువర్ణాక్షరాలు కదా, మిలమిలా మెరుస్తూ ఆ వెలుగులో తరతరాలకు దారి చూపిస్తాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎలాగో నేర్పిస్తాయి. ఆదర్శ జీవితం అంటే ఏమిటో చాటి చెబుతాయి. అలాంటి సువర్ణాక్షరాల సమాహారమే రామోజీరావు అన్న పేరు. ఆయన భౌతికంగా దూరమైనా తన పేరును మాత్రం తెలుగువారు సహా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో లిఖించుకున్నారు.

Recommended