• 4 years ago
T20 world cup 2021 : Lahiru Kumara, Liton Das fined for breaching ICC code of conduct
#t20worldcup2021
#LitonDas
#LahiruKumara
#Icc

టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నామనే సోయి మరిచి క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ లిటన్ దాస్, శ్రీలంక పేసర్ లాహిరు కుమారాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొరడా ఝులిపించింది. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా భారీ జరిమానాతో పాటు డీమెరింట్ పాయింట్స్ విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. గొడవకు కారణమైన లాహిరు కుమారా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. ఇక లాహిరు కుమారా మాటలతో సహనం కోల్పోయి అతనితో వాగ్వాదానికి దిగిన లిటన్ దాస్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు సహనం కోల్పోయిన విషయం తెలిసిందే.

Category

🥇
Sports

Recommended