తెలంగాణలో T20 వరల్డ్​ కప్​ గెలుపు సంబురాలు - సెక్రటేరియట్ వద్ద ఫ్యాన్స్ పూనకాలు

  • yesterday
T20 World Cup Celebrations In Telangana : టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​లో టీమ్​ ఇండియా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి. పలుప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్​ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్​ విజయంపై టీమ్ ఇండియాకు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్​ నేత కేటీఆర్​ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.