• 7 years ago
Jigelu Rani Song Singer Ganta Venkata Lakshmi responds on her remuneration. She responds on controversy
#JigeluRani

వేసవిలో విడుదలైన రాంచరణ్ రంగస్థలం చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా, బాహుబలి తరువాత టాలీవుడ్ లో అంతటి ఘన విజయంగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని టాలీవుడ్ గొప్ప చిత్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్రకు అర్థవంతమైన ప్రాధాన్యత ఇచ్చారు. దేవిశ్రీ సంగీతం కూడా అద్భుతంగా అలరించింది. సుకుమార్ చిత్రాలలో ఐటమ్ సాంగ్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ తనకు మాత్రం అన్యాయం జరిగిందని జిగేలు రాణి సాంగ్ పాడిన సింగర్ గంటా వెంకట లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ని ఎప్పుడూ నిరాశ పరచడు. రంగస్థలం చిత్రం 1980 నేపథ్యంలో వచ్చినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

Recommended