Ammammagarillu Success Meet

  • 6 years ago
Director Sundar Surya's Telugu movie Ammammagarillu starring Naga Shaurya and actress Shamilee, is about a youngster (Naga Shaurya) who shares a warm relationship with his grandmother (played by Sumitra). The movie shows the incidents that occur and the various circumstances he faces while visiting his grandmother's village.

ఛలో' సినిమాతో హిట్ అందుకున్న హీరో నాగశౌర్య ఈ సారి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'అమ్మమ్మగారిల్లు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2009లో వచ్చిన 'ఓయ్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరోయిన్ షామిలీ ఈ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గారీ ఎంట్రీ ఇచ్చింది. సుందర్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాపై టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఒక పాజిటివ్ బజ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మగారి ఇల్లు అనేది ఒక మధుర జ్ఞాపకం. ఆ తీపి జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి.
పిఠాపురంలో పేకేటి రంగారావు(చలపతిరావు) 100 ఎకరాల ఆసామి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లతో సంతోషంగా ఉండే కుటుంబం. అయితే రంగారావు పెద్ద కొడుకు బాబూరావు(రావు రమేష్)కు ఆస్తి పంచుకుని ఆ డబ్బుతో సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఉంటుంది. ఆస్తి పంచమని అడుగుతాడు. అయితే రంగారావుకు ఇది ఇష్టం ఉండదు. ఈ క్రమంలో జరిగిన వాదనలో తన బావ(సుమన్)పై చేయిచేసుకుంటాడు బాబూ రావు. అల్లుడిని తన కొడుకు అవమానించడాన్ని భరించలేక రంగారావు మనస్థాపంతో చనిపోతాడు. ఆస్తి కోసం తండ్రి చావుకు కారణమయ్యాడని ఊర్లో అంతా అనడంతో కోపంతో ఈ ఆస్తి వద్దు, ఈ కుటుంబంతో సంబంధం వద్దు అంటూ బాబు రావు తన భార్య, కూతురుతో కాకినాడ వెళ్లిపోతాడు. తర్వాత మిగిలిన కొడుకులు, కూతుళ్లు ఎవరి దారి వాళ్లు చూసుకుని వివిధ ప్రాంతాల్లో సెటిలైపోతారు. ఊర్లో రంగారావు భార్య సీతమ్మ (సుమిత్ర) ఒంటరిగా ఉండిపోతుంది.

Recommended