• 8 years ago
Mani Ratnam’s next is a Tamil film that stars Jyothika, Simbu, Vijay Sethupathi and Aravind Swamy. Buzz is that senior actress Jayasudha has signed this film and is playing an important role.

జయసుధ భర్త నితిన్ కపూర్ ఆరు నెలల క్రితం మరణించారు. అప్పటి నుంచి కోలుకోలేని విషాదంలో ఉన్న ఆమె కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు, మీడియాకీ, జనానికీ దూరంగా ఉన్నారు. మొన్న జరిగిన గౌతమీ "విన్నర్స్ వాక్" ఈవెంట్ లో కనిపించారు జయసుధ, ఆ విషాదం నుంచి కోలుకోవటానికి చాలానే స్ట్రగుల్ పడ్డ ఈ సహజనటి. మళ్ళీ పాత జయసుధగా కనిపించటానికి ప్రయత్నిస్తున్నారు.
చాలా గ్యాప్ తర్వాత ఆమె మొదటగా మణిరత్నం సినిమాలో నటించడానికే అంగీకరించారు. దక్షిణాది నటీనటులకు మణిరత్నం సినిమాలో నటించటం ఓ కల. అందుకే హిట్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా అంటే చాలు ఎవరైన ఓకె చెప్పేస్తారు.
అలాంటి ఓ అరుదైన అవకాశం మరోసారి టాలీవుడ్‌ సీనియర్‌ నటి జయసుధ తలుపు తట్టింది. భర్త మరణం తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్‌ నటి చాలా కాలం తరువాత ఓ తమిళ సినిమాకు అంగీకరించింది.
మణిరత్నం సినిమా కావటం వల్లనే జయసుధ ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించిందట.ఈ మధ్య కాలంలో వరస ఫ్లాపులతో సతమతమవుతున్న మణిరత్నం ఈసారి పాత - కొత్త నటుల కలయికతో ఓ సినిమా ప్లాన్ చేశాడు. తమిళ్ స్టార్ హీరో శింబు హీరోగా తీయబోయే సినిమాలో ఓ ప్రధాన పాత్రకు తెలుగు నటి జయసుధను తీసుకుంటున్నారు.

Recommended