• 7 years ago
Tollywood beauty Catherine Tresa is going with good success. She got good hits her kitty like Sarainodu, Jaya Janaki Nayaka etc. In this occassion she attended a television show in the eve of New Year and share her personal and profession things to audience.

టాలీవుడ్‌లో అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్లలో క్యాథరిన్ త్రెసా ఒకరు. చమ్మక్ చలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి నానితో పైసా, అల్లు అర్జున్‌తో ఇద్దరు అమ్మాయిలతో, రుద్రమదేవి, సరైనోడు చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న క్యాథిరిన్ ఆలి టెలివిజన్ షోలో పాల్గొని ఆమె మనసులోని భావాలను పంచుకొన్నారు.
దర్శకుడు నీలకంఠం తెలుగులో చమ్మక్ చలో సినిమాలో అవకాశం ఇచ్చారు. అదే సమయంలో దర్శకుడు కృష్ణవంశీ పైసా చిత్రంలో నాని పక్కన నటించే అవకాశం ఇచ్చారు.
తెలుగులో ఎక్కువ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో భాషపై పట్టు ఉండాలని అనుకొన్నాను. అందుకే తెలుగు భాష నేర్చుకోవడంపై సీరియస్‌గా దృష్టిపెట్టాను.
నా కళ్లలో ఓ ప్రత్యేకత ఉంటుంది. అట్రాక్టివ్‌గా ఉంటుంది అని నీలకంఠ, కృష్ణవంశీ, బోయపాటి శ్రీను చెప్పారు. వారికి నాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే. అందుకే వారు నా కళ్ల గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు.
ప్రభాస్‌కు అక్కగా నటించాల్సి వస్తే ఒప్పుకొను. పవన్ కల్యాణ్ వదినగా చేయాల్సి వస్తే తిరస్కరిస్తా. సాధారణంగా కథ, పాత్ర మంచిగా ఉంటే నేను ఎవరి పక్కనైనా లవర్‌గా నటించడానికి ఒప్పుకొంటాను.
పరభాష నేపథ్యంగా క్యాథరిన్ త్రిసా వచ్చినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతున్నందున తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆలీ సూచించగా ఆమె 100 పర్సెంట్ సరేనని చెప్పింది.
అయితే నా మనసు నచ్చే అబ్బాయి ఇంకా దొరకలేదు. నా నచ్చిన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కలిస్తే చూద్దాం. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే అబ్బాయిని పెళ్లి చేసుకొంటాను. పెళ్లి ఎప్పుడు చేసుకొంటాననే విషయం ఇప్పుడే చెప్పలేను.

Recommended