• 8 years ago
Anchor, Actor Anasuya latest movie is Sachchindira Gorre. She teamed up With Srinivas Reddy, Venu, Rakesh, Anand. Recently she take time to meet netizen via Social media

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అంచెలంచెలుగా ఎదుగుతూ యాంకర్‌గా, సినీ నటిగా బ్రహ్మండంగా రాణిస్తున్నారు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఫేస్‌బుక్‌లో లైవ్ కనిపిస్తూ అభిమానులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలోనే శనివారం అనసూయ ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చి నెటిజన్లకు షాక్ ఇచ్చారు. కొన్ని రోజులుగా 'సచ్చిందిరా గొర్రె' చిత్ర షూటింగ్ నిమిత్తం నైట్ షూటింగ్‌లో ఉండటం వల్లే, ఫేస్‌బుక్ లైవ్‌లోకి రాలేకపోయానని అనసూయ చెప్పారు. అయితే నెటిజన్లు అడిగిన సమాధానం చెబుతూ జబర్దస్త్ కార్యక్రమంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా కొందరు అడిగిన పిచ్చి ప్రశ్నలకు ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. .
వినోదరంగంలో జబర్ధస్త్ కామెడీ షో చరిత్ర సృష్టించింది అని ఒప్పుకొని తీరాల్సిందే. తెలుగు టెలివిజన్‌ రంగాన్ని, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని టాప్ లెవల్‌లో నిలబెట్టిన ఘనత జబర్ధస్త్‌ది.
బహుళ ప్రజాదరణను పొందిన అలాంటి కార్యక్రమంపై మరో విధంగా వ్యాఖ్యలు చేయకూడదు. క్రియేటీవిటీని తొక్కేయవద్దు.
జబర్ధస్ కార్యక్రమం కేవలం హాస్యం కోసం మాత్రమే.
ఎవర్నో కించపరుచడానికి జబర్దస్త్ కార్యక్రమాన్ని చేయడం లేదు.

Recommended