• 7 years ago
Getup Srinu, Famous for doing various getups for every skit, He is an unerasable star in telugu tv comedy recently. Getup srinu also termed as “Bulli thera kamal hasan” i.e “shortscreen kamal hassan” is famous in extra jabardasth.

జబర్దస్త్ కార్యక్రమంలో వివిధ గెటప్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాల గురించి కూడా తెలిపారు.
నా ఇంటికి మల్లెమాల నిలయం అని పేరు పెట్టుకున్నా. ఆ సంస్థకు ఎప్పుడూ రుణపడి ఉండాలని తనకు ఎప్పుడూ అలా కనిపిస్తూ ఉండాలని అలా పెట్టుకున్నాను. నాకు జీవితాన్ని ఇచ్చిన సంస్థ, మేము ఈ స్థాయికి రావడానికి కారణం ఆ సంస్థ....మల్లెమాల సంస్థను ఎప్పుడూ మరిచిపోను అని గెటప్ శ్రీను తెలిపారు.
2007లో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ...... అక్కడ ఏదో షూటింగ్ ఓపెనింగ్ జరుగుతుండగా చూడటానికి వెళ్లాను. అక్కడ ప్రొడక్షన్లో తెలిసిన వ్యక్తి ఉంటే షూటింగ్ చూసేవు రమ్మంటే వెళ్లాను, ఆయన తినమంటే భోజనం చేస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఇంచార్జి వచ్చి ఎవడ్రా నువ్వు అని అడిగారు. తెలిసిన వారి ద్వారా లోనికి వచ్చాను అంటే... నన్ను బూతులు తిట్టారు. ప్లేటు లాగేసి కాలరు పట్టుకుని బయటకు గెంటేశారు.... అని గెటప్ శ్రీను తెలిపారు.
మా అమ్మ నాన్నకు ఇండస్ట్రీ అంటే, సినిమా అంటే తెలియదు. వ్యవసాయ కుటుంబం. మా అన్నయ్యకు ఇండస్ట్రీ గురించి తెలుసు. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఇంటర్ అయిపోయాక చదువు మధ్యలో మానేసి అప్పులు తీర్చాలనే ఉద్దేశ్యంతో ఏదైనా జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. అదే సమయంలో సినిమా అవకాశాల కోసం తిరగొచ్చు అనే వచ్చేశాను.... అని గెటప్ శ్రీను తెలిపారు.
నేను బాగా హర్టయిపోయి సూసైడ్ వరకు వెళ్లింది తేజ కేక సినిమా సమయంలో. ఆడిషన్ వెళ్లాను, సెలక్టయ్యాను. తేజగారు రెండోసారి నన్ను టెస్ట్ చేస్తుంటే....ఏదో ఆలోచిస్తున్నావన్నారు. లేదు సార్ చేయడం లేదు అన్నాను. నువ్వు ఇపుడే ఇలా సమాధానం చెబెతున్నావ్ రేపు సినిమాలో కష్టం అని రిజక్ట్ చేశారు. వెళ్లిపో అన్నారు. ట్యాంక్ బండ్ వెళ్లిపోయి బుద్దున్ని చూస్తూ అలా ఉండిపోయాను. దూకేద్దామా? చచ్చిపోదామా? ఏం చేద్దాం అలా ఉండిపోయాను. చివరకు ఆలోచన విరమించుకున్నాను అని గెటప్ శ్రీను తెలిపారు.

Recommended