• 8 years ago
Roja, Bandla Ganesh controversy hits Nagababu. Bandla Ganesh responded aggressively on Roja comments which on Pawan Kalyan. Apart from this, Roja is playing judge role with Nagababu in Jabardast show. So Pawan Fans are demanding Nagababu to withdrawn his role from comedy show.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా స్పందించిన తీరు అటు రాజకీయ, సినీ, మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. వారసత్వ రాజకీయాలను తప్పుపట్టిన పవన్‌పై రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జరిగిన చర్చ సందర్భంగా బండ్ల గణేష్, రోజా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొన్నది. మారి మాటల యుద్దంలో చాలా దారుణమైన తిట్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగబాబు, రోజా నిర్వహించే జబర్దస్త్ కామెడీషోపై ఎలాంటి ప్రభావం పడబోతుందనే తాజా చర్చ ఒకటి జరుగుతున్నది.
వారసత్వం అనే విషయం రాజకీయాలకే ఎందుకు పరిమితం.. సినిమా పరిశ్రమకు కూడా వర్తించాలి? మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ గానీ, ఆయన ఇంట్లోని హీరోలను పెట్టి ఎవడు సినిమా తీస్తాడు.. వాళ్లను ఎవడు చూస్తాడు అని రోజా ధ్వజమెత్తింది.
రోజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టెలివిజన్ చానెల్ బండ్ల గణేష్‌తో చర్చకార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రోజా పవన్ కల్యాణ్‌ను ఎవడు అంటూ కామెంట్ చేయడం..పల్లురాలతాయ్ అంటూ తిట్టడం చేసారు..వీటిపై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Recommended