• 8 years ago
A teenager from Iran has found herself in the spotlight after reports of her having undergone 50 surgeries to look like Angelina Jolie began doing the rounds.

హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వయసులో ఉన్నపుడు ఏంజెలీనా అందం ప్రపంచ సినీ అభిమానులను కట్టిపడేసింది. ఆమె స్టైల్‌ ఫాలో అయినవారి లెక్క చెప్పడం కష్టమే. ఏంజలీనా జోలీ అంటే తెగ ఇష్టపడే ఇరాన్‌కు చెందిన ఓ టీనేజర్ తన అభిమాన నటిలా మారాలనుకుంది. ఇందుకోసం ఏకంగా 50 సర్జరీలు చేసుకుంది. సర్జరీల తర్వాత ఆ అభిమాని ఎవరూ ఊహించని విధంగా తయారైంది.
ఇరాన్‌కు చెందిన 19 ఏళ్ల సహార్ టబర్‌కు హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ అంటే పిచ్చి. ఆమెలా మారేందుకు ఏం చేయడానికైనా సిద్ధమైంది. ఇందుకోసం తన ముఖానికి, శరీరానికి సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది.
తన అభిమాన తారలాగా మారేందుకు సహార్ టబర్ కొన్ని నెలల వ్యవధిలో దాదాపు 50 సర్జరీలు చేయించుకుందట. అంతేకాదు తన బరువు 40 కేజీలకు మించకుండా కఠినమైన డైట్ మెయింటేన్ చేసిందట.
సర్జరీ తర్వాత తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సహార్ టబర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. ఆ పోస్టుల తర్వాత ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Recommended