• 7 years ago
"If you know any child with a problematic heart condition in your area requiring a heart surgery and family is unable to afford the same - please contact The Larencce Charitable Trust at the following numbers...09790750784, 09791500866" posted Raghava Lawrence

రాఘవ లారెన్స్ సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఆయన "ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్" ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిన్నారు. ఇప్పటి వరకూ ఆయన తన ట్రస్ట్ ద్వారా 141 మంది చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. ఆ మధ్య జల్లికట్టు వివాదంలో తన వంతు సపోర్ట్ అందించిన లారెన్స్ , రీసెంట్గా ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఇప్పటివరకు 140 చిన్నారులకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా శివాని అనే పాప హార్ట్ లో హోల్ ఉండటంతో ఆ పాపకి ఆపరేషన్ చేయించాడు.
ఇది కూడా సక్సెస్ అయిందంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు లారెన్స్ . ఇప్పటి వరకు తన ట్రస్ట్ ద్వారా 141 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరగగా, ఇంకెవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుంటే తమని సంప్రదించవచ్చని కాంటాక్ట్ నంబర్లని తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు.
"మా 141వ ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది. ఆ పాప పేరు శివాని.. ఒక సంవత్సరం వయసు.. హార్ట్‌లో హోల్ ఉండటంతో ఆపరేషన్ నిర్వహించాము. పాప ప్రస్తుతం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ల బృందానికి థ్యాంక్స్.

Recommended