• 8 years ago
Is Incometax officials searching the photograph and videos of Jayalalitha at Apollo hospital as Sasikala family claiming that they heve evidence that Jayalalitha is alright at hospital while at treatment.

శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు మరో ఝలక్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. శశికళ కుటుంబ సభ్యుల అందరి ఇళ్లలో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళకు ఊహించని షాక్ ఇవ్వాలని నిర్ణయించారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స చేస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశామని చెప్పిన శశికళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు ఎక్కడ ఉన్నాయి అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఇప్పటికే శశికళ ఫ్యామిలీకి చెందిన రూ. వందల కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఐటీ శాఖ అధికారులు జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించాలని సిద్దం అయ్యారని తెలిసింది. వివేక్ ఇంటిలోనే ఫోటోలు, వీడియో ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News

Recommended