మనం వాడే ప్రతీ పిసీలోని మదర్ బోర్డ్ పై CMOS చిప్ ఉంటుందని, అందులోనే BIOS సెట్టింగులన్నీ భద్రపరచబడి ఉంటాయనీ తెలిసిందే. BIOSలోని సెట్టింగులు ఎవరుబడితే వారు మార్చకుండా అందులోకి ప్రవేశించాలంటే సరైన పాస్ వర్డ్ టైప్ చేస్తేనే వెళ్లగలిగేలా మనం రక్షించుకుంటూ ఉంటాం కూడా! అలాగే పిసిలోకి వెళ్లాలన్నా పాస్ వర్డ్ టైప్ చేస్తేనే వెళ్లగలిగేలా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కోసారి ఈ పాస్ వర్డ్ లను మర్చిపోతాం. దాంతో మనం అటు BIOSలోకీ, ఇటు పిసిలోకీ వెళ్లలేకపోతాం. సరిగ్గా ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే ఈ వీడియోలో నేను చూపిస్తున్న సులువైన చిట్కా మీకు ఉపయోగపడుతుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
Category
🤖
Tech