• 7 years ago
"Arey O samba Hukum Sardar program will bring you some simple chitchat, gossip, photos, videos etc..from our Samba’s world. P.S And also steamy affairs from our Samba’s world." Pawan Kalyan said.

ఇటీవల జరిగిన పరిణామాలతో తెలుగులో కొన్ని న్యూస్ ఛానల్స్ మీద ఆరోపణలు వర్షం కురిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయా ఛానల్స్ రన్ చేస్తున్న అధినేతలను టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీవీ 9 రవి ప్రకాష్, శ్రీనిరాజు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. త్వరలోనే "అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఏదైనా రాజకీయ పార్టీ మనుగడ సాధించాలంటే దానికి మీడియా సపోర్ట్ చాలా అవసరం అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఆయా పార్టీలకు మద్దతుగా కొన్ని ఛానల్ ఉన్నాయనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరలో సొంత మీడియా ఛానల్ ప్రారంభించబోతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి.
"త్వరలోనే సరదాగ , కాలక్షేపం కోసం "అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది" అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లతో త్వరలోనే ఆయన టీవీ ఛానల్ ప్రారంభిస్తారని, అందులో ఈ షో రన్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Recommended