భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురం సమీప అటవీ ప్రాంతంలో ఉన్న హజరత్ ఖాసీం దుల్హ నాగుల్ మీరా దర్గాలో మతసామరస్యాన్ని ప్రతిబింబించేలా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు నడుమ సీతారాముల కళ్యాణం కనుల పండుగగా సాగింది. కుల, మతాలకు అతీతంగా దర్గాలో శ్రీరామ కళ్యాణం నిర్వహించారు. తీరున ఎదుర్కోలు, కళ్యాణం అభిజిత్ లగ్నంలో కళ్యాణ ఘట్టం జరిపించారు.
Category
🗞
News