శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు రెండు వారాలుగా అనేక ఏజన్సీలు నిరంతరం శ్రమిస్తున్నాయి NDRF, SDRF, NGRI, Singareni, Rat Hole Mines, Hydra వంటి సంస్థలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మనుషులు చిక్కుకున్న ప్రదేశం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోవడంతో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్- NDMA కేరళ SDRFను కడావర్ డాగ్స్ ను తెప్పించింది. కేరళ నుంచి కడావర్ డాగ్స్ వాటి ట్రైనర్లతో శ్రీశైలం చేరుకున్నాయి. కేరళ సర్కార్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అభ్యర్థన మేరకు సహాయ చర్యల కోసం 2 స్నిఫర్ డాగ్స్‌ను పంపింది. సహాయచర్యల్లో వీటిని వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు.Cadaver Dogs అనేవి శిక్షణ పొందిన శునకాలు. ఇవి మానవ అవశేషాలను గుర్తిస్తాయి. 14 రోజుల క్రితం శిథిలాల కిందట చిక్కుకున్న శ్రామికులు బ్రతికుండటం దాదాపు అసాధ్యం అనే భావిస్తున్నారు. ఈ కడావర్ డాగ్స్ మనిషి వానసను గుర్తించి వారి అవశేషాలను పసిగట్టగలుగుతాయి. మామూలు పోలీస్ డాగ్స్.. మనుషుల వాసనను పసిగడతాయి, కానీ కాడావర్ డాగ్స్ ప్రత్యకంగా డీకంపోజ్ అవుతున్న బాడీలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
Category
🗞
News