కోనసీమలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం సందడి చేసింది . అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో నందమూరి కుటుంబ ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహానికి హాజరైన హీరో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. కారుపర్తి కోటేశ్వరరావు ఎన్టీఆర్ కు బాగా కావాల్సిన వ్యక్తి కాగా..తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో పెళ్లి పెద్దలుగా కోటేశ్వరరావు NTR లక్ష్మీప్రణతి పేర్లు రాయించారు. కారుపర్తి కోటేశ్వరరావు స్వయానా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ల పెళ్లి జరిపించిన పురోహితులు. వారి ఊరిలో ఆలయాల నిర్మాణానికి సైతం ఎన్టీఆర్ సహాయపడ్డారు. కారుపర్తి కోటేశ్వరరావు ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న జగ్గన్నపేట ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కారుపర్తి వారి ఇంటితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగానే ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా ఆయన కుటుంసభ్యులంతా పెళ్లికి హాజరై వధూ వరులను దీవించారు.
Category
🗞
News