• 2 days ago
పాకిస్తాన్‌కు చెందిన తొలి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లోని తన సొంతూరుకు వెళ్లారు. మలాలా తండ్రి, సోదరుడు, భర్తతో కలిసి మలాలా పాకిస్తాన్ కు చేరుకున్నారు. హై సెక్యూరిటీ మధ్య మలాలా పాకిస్తాన్ టూర్ జరిగింది. తన స్వస్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను కలిశారు. మలాలా హెలికాప్టర్‌లో బర్కానాకు వెళ్లి తన మేనమేమను కలిశారు. 2018లో బర్కానా జిల్లాలో సుమారు వెయ్యి మంది బాలికలకు ఉచిత విద్యను అందించడానికి తాను స్థాపించిన పాఠశాల, కళాశాలను మలాలా సందర్శించారు. 9 అక్టోబర్ 2012న, పాకిస్తాన్‌లోని స్వాత్ వ్యాలీలో మలాలపై తాలిబన్లు కాల్చాడు. అప్పుడు మలాలా ఆయాస 15 ఏళ్ళు. ఆ తర్వాత ఆమెని సర్జరీ కోసం UKకి తరలించారు. అప్పటి నుండి మలాలా ఇంగ్లాండ్ లోనే ఉంటున్నారు. ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించిన సందర్భంలోనూ స్వదేశానికి మలాలా తిరిగిరాలేదు. ఇన్నాళ్ల తర్వాత తన మాతృదేశాన్ని చూడటం ఒకింత ఉద్వేగానికి లోనయ్యానని మలా చెప్పారు. 

Category

🗞
News

Recommended