• 2 days ago
Bio Asia Conference 2025 : బయో ఆసియా సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. రూ.5,445 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన కంపెనీల వల్ల దాదాపు 10 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పలు అంతర్జాతీయ లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, ఇంజనీరింగ్ కంపెనీలతో పాటు అంకుర పరిశ్రమలు పాల్గొన్నాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 5 స్టార్ట్‌అప్‌లకు ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేశారు. వివిధ దేశాలకు చెందిన ఫార్మారంగ నిపుణులతో పాటు దేశంలోని శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులు, ఏఐ కంపెనీల ప్రతినిధులు, ఫార్మా విద్యార్థులు పాల్గొని స్టాళ్లను తిలకించారు.

హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన బయో ఆసియా సదస్సు విజయవంతంగా ముగిసింది. 'మార్పునకు ఉత్ప్రేరకం' అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్‌, ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.5,445 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీల వల్ల 10వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. 11 కొత్త కంపెనీలు గ్రీన్‌ ఫార్మాసిటీలో నెలకొననున్నాయి. దేశ విదేశాలకు చెందిన 4వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఫార్మా రంగంలో పరిశోధనలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కరించాల్సిన అంశాలపై 100 మంది నిపుణులు చర్చించారు. కంపెనీలు, అంకుర పరిశ్రమల మధ్య 200 కు పైగా సమావేశాలు జరిగాయి.

Category

🗞
News

Recommended