• last month

TDP Release Data On Rapes and Crimes Against Women : గత ప్రభుత్వంలో ఒక్క మహిళలపైనే 2,04,414 నేరాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. సుమారు 4,034 అత్యాచారాలు జరిగాయని, 22,278 మంది మహిళలు అదృశ్యమయ్యారని గణాంకాలు వెల్లడించింది. అనేక సందర్భాల్లో కేసులూ నమోదు చేయలేదని పేర్కొంది. 5,660 సైబర్ నేరాలు జరగ్గా, గృహ హింసకు సంబంధించిన 15,065 కేసులు నమోదయ్యాయని వివరించింది. 60 వరకు సామూహిక అత్యాచారాలు, చిన్నారులపై 7,841 నేరాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా 6,604 ఘటనలు, 991 హత్యలు జరిగినట్లు వివరాలు విడుదల చేసింది. 2,005 మంది తెలుగుదేశం కార్యకర్తలు, 2,014 మంది జనసేన, 69 మంది బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపింది. 267 మంది అమరావతి రైతులపై 2,528 కేసులుపెట్టారన్న తెలుగుదేశం, 2,686 మందిని పొట్టనపెట్టుకున్నారని మండిపడింది.

Category

🗞
News

Recommended