• last year
Cat Drinking Curd in Kukatpally JNTU Canteen : కొద్దిరోజుల క్రితం సుల్తాన్​పూర్​లోని జేఎన్టీయూ బాలుర వసతి గృహం క్యాంటీన్​ చట్నీలో ఎలుక సంఘటన మరువక ముందే కూకట్​పల్లి జేఎన్టీయూలో పెరుగును పిల్లి తాగుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జేఎన్టీయూలో పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు.

ఇప్పటికే కొందరు విద్యార్థులు క్యాంటీన్లలో, వసతి గృహంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత, శుభ్రత ఉండటం లేదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదని తెలిపారు. పైగా ఫిర్యాదులు, ఆందోళనలు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.

Category

🗞
News

Recommended