• 7 years ago
An eight-year-old girl body in Jammu and Kashmir's Kathua dumped on a roadside.

జమ్మూ కాశ్మీర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కథువా అనే ప్రాంతం లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది..అత్యాచారం చేసి, ఆమెను చంపేసి, శవాన్ని రోడ్డు పక్కన పడేశారు. అత్యాచారం జరిగిన బాలిక ఈ నెల 10వ తేదీ నుంచి కనిపించడం లేదు. రసన అనే గ్రామంలోని తన ఇంటి నుంచి ఆ రోజు బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ సంఘటన పట్ల ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు.
వేగంగా దర్యాప్తు సాగిస్తాని, దోషులను శిక్షిస్తామని ఆమె ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. అత్యంత నీచమైన సంఘటనకు బాలిక ప్రాణాలు కోల్పోయిందని, సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆమె అన్నారు. బాలిక ముఖంపై, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలున్నాయని, ఆమెను చిత్రహింసలు పెట్టారని దీన్ని బట్టి అర్తమవుతోందని అంటున్నారు.

Category

🗞
News

Recommended